తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస ఆడుతున్న నాటకాలకు ప్రజలే బుద్ధి చెబుతారు: ఉత్తమ్ - సిద్దిపేట జిల్లా వార్తలు

కేసీఆర్, హరీశ్​ రావు ఆడుతున్న నాటకాలకు ప్రజలు బుద్ధి చెబుతారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

pcc chief uttam kumar reddy campaign in dubbaka
ప్రజలే బుద్ధి చెబుతారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

By

Published : Oct 22, 2020, 9:18 PM IST

దుబ్బాక ఉప ఎన్నికల్లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి గెలవడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్, హరీశ్​ రావు ఆడుతున్న నాటకాలకు ప్రజలు బుద్ధి చెబుతారని విమర్శించారు.

చేనేత సహకార సంఘంలోకి వెళ్లి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. పలు వీధులలో తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

ఇవీ చూడండి:నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా: మంత్రి హరీశ్

ABOUT THE AUTHOR

...view details