తెలంగాణ

telangana

ETV Bharat / state

అవిశ్వాసాలను ఆపేదెలా: తలలు పట్టుకుంటున్న అధికారులు - no confidence motion latest news

పురపాలికలు, నగరపాలికల్లో పెరిగిపోతున్న అవిశ్వాస తీర్మానాలు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఛైర్‌పర్సన్లు, మేయర్లపై కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇచ్చిన నోటీసులపై సమావేశాల నిర్వహణకు గడువు సమీపిస్తుండటంతో ఏం చేయాలనే అంశంపై మథనపడుతున్నారు. పురపాలక చట్ట సవరణ బిల్లుకు గవర్నర్‌ నుంచి ఆమోదం లభిస్తుందని.. మరో ఏడాది గడువు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

అవిశ్వాసాలను ఆపేదెలా: తలలు పట్టుకుంటున్న అధికారులు
అవిశ్వాసాలను ఆపేదెలా: తలలు పట్టుకుంటున్న అధికారులు

By

Published : Feb 16, 2023, 7:13 AM IST

రాష్ట్రంలో 20 పురపాలక ఛైర్‌పర్సన్లు, నగరపాలక సంస్థల మేయర్లపై అవిశ్వాస తీర్మాన నోటీసులు వచ్చాయి. అందులో సుమారు 9, 10 చోట్ల మార్చి తొలివారంతో నెల రోజుల వ్యవధి ముగిసిపోనుంది. ముగియనుంది. దీంతో ఈ నోటీసులపై ఏం చేయాలనే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. అవిశ్వాస తీర్మానాల సమయం దగ్గర పడుతుండటంతో వాటి నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు ఛైర్మన్‌లు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు స్టే విధిస్తే తాము తాత్కాలికంగా తీర్మానాల నుంచి బయటపడొచ్చని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ చిన్న రాజమౌళిపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టగా.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన ఉన్నత న్యాయస్థానం అవిశ్వాస తీర్మానం అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయంపై పలు పిటిషన్‌లు దాఖలయ్యాయని.. వీటిపై ప్రభుత్వంతో పాటు కౌన్సిలర్లు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

లభించని ఆమోదం..: ఛైర్మన్‌లు, మేయర్లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టెందుకు గతంలో మూడేళ్ల గడువు ఉండగా.. ఇటీవల ప్రభుత్వం ఆ గడువును నాలుగేళ్లకు పెంచుతూ బిల్లు తీసుకొచ్చింది. అయితే ఈ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం లభించకపోవడంతో ఇంకా చట్టబద్ధత లభించలేదు. దీంతో గతంలో ఉన్న మూడేళ్ల కాలమే ఇప్పటికీ అమలులో ఉంది. దీంతో అవిశ్వాస తీర్మానాలకు అడ్డుకట్ట పడటం లేదు. పాత చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానాలు పెట్టాలంటే కనీసం సగం మంది కార్పొరేటర్లకు తగ్గకుండా సంతకాలు చేసి అధికారులకు అందించాల్సి ఉంటుంది. ఈ నోటీస్‌పై 30 రోజుల్లోగా ఓ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఆ మీటింగ్‌లో 3/2 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేస్తేనే తీర్మానం చెల్లుతుంది. లేదంటే లేదు. ఈ నిబంధనలనే కొత్త చట్టంలోనూ ప్రవేశపెట్టి.. హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details