సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జవహర్లాల్ నెహ్రూ 130వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మల్లెచెట్టు చౌరస్తాలో ఉన్న నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం కోసం తన ఆస్తులను సైతం అమ్మిన గొప్ప వ్యక్తి నెహ్రూ అని డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి కొనియాడారు. దేశానికి మొదటి ప్రధానిగా 14 సంవత్సరాలు ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు.