సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట మండల తహసీల్దార్ నాగజ్యోతిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో బెజ్జంకి మండల తహసీల్దార్‌గా పని చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి దగ్గర భూ సమస్య పరిష్కారం కోసం లంచం తీసుకొన్నారు. పనికాకపోవటం వల్ల ఆ బాధితుడు డబ్బు తిరిగి చెల్లించాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. కొంత డబ్బును నేరుగా చెల్లించి... ఇంకొంత డబ్బు చెల్లించడంలో ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన చెక్‌ను బాధితునికి ఇచ్చారు. అది కాస్త బౌన్స్ కావడంతో ఆ సమాచారం లీక్ అయి ఓ ప్రముఖ వార్త పత్రికలో ప్రచురణ అయింది. విషయం కలెక్టర్ కృష్ణభాస్కర్ దృష్టికి వెళ్లటం వల్ల నాగజ్యోతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అక్కన్నపేట తహసీల్దార్ నాగజ్యోతి సస్పెన్షన్
భూ సమస్య పరిష్కారంలో భాగంగా గతంలో పనిచేసిన చోట లంచం తీసుకున్నారనే ఆరోపణలతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట తహసీల్దార్ నాగజ్యోతి సస్పెన్షన్‌కు గురయ్యారు.
అక్కన్నపేట తహసీల్దార్ నాగజ్యోతి సస్పెన్షన్