సిద్దిపేట జిల్లా మార్కు మండలం ఎర్రవల్లి గ్రామానికిచెందిన ఎల్లవ్వ కొన్ని రోజులుగా జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతోంది. పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తర్వాత ఆమె కుమారుడు పరశురాముడికీ వైరస్ సోకింది. లాక్‌డౌన్‌కు ముందు ఇద్దరూ కూలీ చేసుకుని బతికేవారు.
Corona Victims : పది రోజులుగా పస్తులు.. సాయం కోసం పడిగాపులు - lock down in siddipet district
లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయారు. కూలీ చేసుకుని బతికే వారు.. ఉన్న కాస్త డబ్బుతో పూట గడుపుకునే వారు. ఇంతలో కరోనా మహమ్మారి సోకింది. ఉన్న డబ్బూ అయిపోయింది. తినడానికి తిండి లేక.. చికిత్సకూ నోచుకోక పదిరోజుల నుంచి పస్తులుంటున్నారు ఆ తల్లీకొడుకు. దాతలెవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలని.. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
సిద్దిపేట జిల్లా వార్తలు, సిద్దిపేటలో తల్లీకొడుకల వ్యథ
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఉన్న ఉపాధి పోయింది. చేతిలో చిల్లి గవ్వ లేదు. తినడానికి గుప్పెడు మెతుకులు లేవు. పైగా మహమ్మారి బారిన పడ్డారు. పది రోజుల నుంచి తినడానికి సరైన తిండి లేక పస్తులుంటున్నారు. దాతలెవరైనా కరుణించి తమను ఆదుకోవాలని ఆ తల్లీకుమారుడు కోరుతున్నారు.