కొవిడ్ నుంచి కోలుకున్న వారి ప్లాస్మాదానంతో బాధితుల ప్రాణాలు కాపాడుకోవచ్చని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వైరస్ గురించి ఆందోళన చెందకుండా దానిని ఎదుర్కునేలా ధైర్యంగా ఉండాలని మంత్రి సూచించారు. సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో కరోనా మొబైల్ టెస్టింగ్ వాహనాన్ని ఆయన ప్రారంభించారు.
'స్వచ్ఛందంగా ప్లాస్మాదానం చేయండి... బాధితుల ప్రాణం కాపాడండి' - సిద్దిపేటలో ఆర్టీపీఎస్ఆర్ సెంటర్ ప్రారంభం
కరోనాను జయించిన వ్యక్తులు... ప్లాస్మా దానానికి ముందుకు రావాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కరోనా మొబైల్ టెస్టింగ్ వాహనాన్ని ఆయన ప్రారంభించారు.
'స్వచ్ఛందంగా ప్లాస్మాదానం చేయండి... బాధితుల ప్రాణం కాపాడండి'
కొంతమంది నిర్లక్ష్యం వల్లనే వైరస్ వ్యాప్తి చెందుతుందన్న మంత్రి.. జిల్లాలో 40 ర్యాపిడ్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా జిల్లాలోనే ఆర్టీపీఎస్ఆర్ కేంద్రాన్ని ప్రారంభించామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పనితీరును హైకోర్టు ప్రశంసించిందన్నారు.
ఇదీ చూడండి:వర్షాలతో తడిసిముద్దైన ఆ రెండు జిల్లాలు