వచ్చే వేసవికి రాష్ట్రంలోని ఏ ఒక్క ఆవాసంలోనూ తాగునీటి సమస్య తలెత్తకూడదని మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో 'మిషన్ భగీరథ నీటి వినియోగం- సంరక్షణ'పై రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి చివరి నాటికి మిషన్ భగీరథ స్థిరీకరణ పనులు పూర్తి కావాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలి' - మిషన్ భగీరథ
సిద్దిపేట జిల్లా కోమటిబండలో 'మిషన్ భగీరథ నీటి వినియోగం- సంరక్షణ'పై ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే రాష్ట్రంలోని మెజార్టీ గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి సరఫరా అవుతున్నాయన్నారు. మార్చి నాటికి పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. ఇంట్రా విలేజ్ పనుల్లో ఖమ్మం, నల్గొండ జిల్లాలు వెనుకబడ్డాయని తెలిపారు. స్థానిక అధికారులు పనులు వేగవంతం చేయకుంటే చర్యలు తప్పవన్నారు. పూర్తి స్థాయిలో సరఫరా అయ్యే గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి... మిషన్ భగీరథ నీటిని తాగేలా ప్రజలు చైతన్యపరచాలన్నారు.
ఇవీ చూడండి:కేరళ వరద బాధితులకు ఈనాడు ఇళ్లు అందజేత.. సీఎం పినరయి హాజరు