తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడో పంపును ప్రారంభించిన హరీశ్​రావు​

సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్​ రిజర్వాయర్​ టన్నెల్​లో మూడో పంపును మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. పెండింగ్​లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

By

Published : May 1, 2020, 6:50 AM IST

minister harishrao started the ranganayaka sagar third pump
మూడో పంపును ప్రారంభించిన హరీశ్​రావు​

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్రపూర్​లోని రంగనాయక సాగర్​ టన్నెల్​లో మూడో పంపును ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. మరో వారం రోజుల్లో నాల్గో మోటార్​నూ ప్రారంభిస్తామని తెలిపారు.

రంగనాయక సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 0.5 టీఎంసీ నీరు చేరుకుందని మంత్రి తెలిపారు. 1.5 టీఎంసీలు చేరగానే కుడి, ఎడమ కాల్వల ద్వారా నీళ్లు విడుదల చేస్తామన్నారు. ఇక్కడి నుంచి మల్లన్న సాగర్ పంప్​హౌస్​కు సైతం త్వరలోనే నీళ్లు పంపిస్తామని స్పష్టం చేశారు.

రంగనాయక సాగర్ రిజర్వాయర్ ద్వారా 500 చెరువులను నింపడమే కాకుండా.. సాగు భూములకూ నేరుగా నీళ్లు అందిస్తామని మంత్రి తెలిపారు 2, 3 రోజుల్లో దాదాపు 200 చెరువులు, కుంటలు, చెక్​డ్యామ్​లు నింపుతామన్నారు. ఇంకా ఏమైనా పనులు పెండింగ్​లో ఉంటే త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి: లాక్‌డౌన్‌ తర్వాత పరిశ్రమలు యథావిధిగా నడవాలి: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details