Harish Rao on Job Notification: రాష్ట్రంలో త్వరలో గ్రూపు 4 నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శారీరక దృఢత్వ శిక్షణను పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ అభ్యర్థులకు పాలు, పండ్లును పంపిణీ చేశారు. తెలంగాణలో ఇప్పటికే 17వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. ఆ శాఖలోనే మరో 2 వేల పోస్టులు భర్తీ చేస్తామని హరీశ్‌రావు వివరించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అగ్నిపథ్ ఆర్మీ నియామకాలకు యువత ముందుకు రావడం లేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. 4 ఏళ్ళ కాంట్రాక్ట్‌తో ఉద్యోగాలు భర్తీ చేయడంలో కేంద్రం వైఫల్యమైందంటూ దుయ్యబట్టారు. ఉద్యోగం తర్వాత భద్రత కోసం పింఛను సైతం లేదన్నారు. గ్రూపు 4 ఉద్యోగాల్లో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయని హరీశ్‌రావు వెల్లడించారు.