సిద్దిపేట పీజీ కళాశాల నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఓయూ అధికారులను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఓయూ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఆరేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయని... ఓయూ అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
పీజీ కళాశాల పనులు పదిరోజుల్లో పూర్తి చెయ్యాలి: హరీశ్ రావు - harish rao meet with ou officers
సిద్దిపేట పీజీ కళాశాల నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఓయూ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. పనుల జాప్యంపై ఓయూ అధికారులను, గుత్తేదారును ప్రశ్నించారు.
ఓయూ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమావేశం
పది రోజుల్లో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసిన హరీశ్ రావు.. జాప్యం జరిగితే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. నర్సాపూర్, జోగిపేట పీజీ కళాశాలలను మరోచోటుకు తరలిస్తారన్న ప్రచారం జరుగుతోందని స్థానిక ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్... మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పీజీ కళాశాలలను అక్కడి నుంచి తరలించొద్దని.. విద్యార్థులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు.
ఇదీ చూడండి:భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్