రాష్ట్రానికే నాటు కోళ్లు, పిల్లల ఉత్పత్తి కేంద్రంగా సిద్దిపేట జిల్లాలోని చిన్నగుండవెళ్లి మారాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. గ్రామంలో శ్రీ రేణుకా మాత గౌడ కల్యాణ మండపం, నాటు కోళ్ల పౌల్ట్రీఫామ్, ముదిరాజ్, కుమ్మరి కమ్యూనిటీ హాల్ భవనాల నిర్మాణాలను మంత్రి ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే సదుద్దేశంతో ప్రతీ ఇంట్లో నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించామని హరీశ్‌రావు తెలిపారు. త్వరలోనే ఇంటింటికీ నాటు కోళ్లు పంపిణీ చేస్తామన్నారు. మహిళా స్వయం ఉపాధే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
'మహిళలకు స్వయం ఉపాధి కల్పించటమే ప్రభుత్వ లక్ష్యం'
సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్లిలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మహిళలకు నాటు కోళ్లను పంపిణీ చేశారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు.
MINISTER HARISH RAO VISITED IN CHINNAGIUNDAVELLI VILLAGE