తెలంగాణ

telangana

ETV Bharat / state

యువత అన్ని రంగాల్లో ఆల్‌రౌండర్‌గా రాణించాలి: హరీశ్​రావు - KCR Cricket Trophy latest news

సిద్దిపేటలోని క్రీడా మైదానంలో కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీని మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. యువత అన్ని రంగాల్లో ఆల్‌రౌండర్‌గా రాణించాలని మంత్రి సూచించారు.

యువత అన్ని రంగాల్లో ఆల్‌రౌండర్‌గా రాణించాలి: హరీశ్​రావు
యువత అన్ని రంగాల్లో ఆల్‌రౌండర్‌గా రాణించాలి: హరీశ్​రావు

By

Published : Feb 8, 2021, 11:21 AM IST

'యువత అన్ని రంగాల్లో ఆల్‌రౌండర్‌గా ప్రతిభ చాటాలి. చదువు, ఆటలు, సామాజిక సేవలో రాణించాలి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవిస్తూ తోటి వారికి సహకారం అందించాలి' అని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేటలోని క్రీడా మైదానంలో కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీని ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ట్రోఫీని ఆవిష్కరించిన మంత్రి హరీశ్‌రావు

విజేత జట్టుకు రూ.1,00,116, రన్నర్‌ జట్టుకు రూ.50,116 ఇస్తామని మంత్రి హరీశ్​రావు తెలిపారు. సిక్సు కొడితే రూ.వేయి చొప్పున ప్రోత్సాహకం అందజేస్తామని ప్రకటించారు. ట్రోఫీ తుది పోటీలకు ప్రముఖ క్రికెటర్లు అజహరుద్దీన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ను ఆహ్వానించామన్నారు. స్థానికంగా అన్ని హంగులు, ప్రమాణాలతో క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేశామని, 16 రకాల కోర్టులు అందుబాటులో ఉన్నాయన్నారు.

పట్టణంలోని 60 జట్ల నుంచి 800 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననుండటం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే జాతీయస్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు సిద్దిపేట వేదికగా మారనుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కలకుంట్ల మల్లికార్జున్‌, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, మున్సిపల్‌, సుడా, ఏఎంసీ ఛైర్మన్లు కడవేర్గు రాజనర్సు, రవీందర్‌రెడ్డి, సాయిరాం, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ అక్తర్‌పటేల్, వివిధ సంఘాల సభ్యులు, పలువురు క్రీడాకారులు‌ తదితరులు పాల్గొన్నారు. ట్రోఫీ ఆవిష్కరణ.. ప్రారంభం సందర్భంగా పెద్దసంఖ్యలో తరలివచ్చిన క్రీడాకారులతో మైదానం సందడిగా మారింది.

ABOUT THE AUTHOR

...view details