రంగనాయక సాగర్ ప్రధాన కుడి, ఎడమ కాల్వల పరిధిలోని రైతులు నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేటలోని తన నివాసంలో ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
'కాల్వల నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి' - WATER USAGE
సిద్దిపేటలోని తన నివాసంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాన కుడి, ఎడమ కాల్వల తూములకు యుద్ధ ప్రాతిపదికన గేట్లు బిగించాలని... కాల్వలపై సిమెంట్, కాంక్రీటు లైనింగ్ అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ప్రధాన కుడి, ఎడమ కాల్వల తూములకు యుద్ధప్రాతిపదికన గేట్లు బిగించాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. చివరి ఆయకట్టు రైతులకు సాగు నీరందేలా రైతులు సహకరించేలా ఆయా మండల తహసీల్దార్లు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని మంత్రి సూచించారు. రైతుల అవసరాలను గుర్తించి నీటి విడుదలలో హెచ్చతుగ్గులు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి ద్వారా నీటిని విడుదల చేస్తుండటం వల్ల నీటి వృథా తగ్గటమే కాకుండా... పంట దిగుబడి కూడ పెరిగిందని తెలిపారు. రైతులు అవసరమున్నంత వరకు నీళ్లు వాడుకుని తూములను మూసివేసేలా చొరవ చూపాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు.