తెలంగాణ

telangana

ETV Bharat / state

'సిద్దిపేట తరహాలో దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం' - dubbaka by election campaign

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు... మంత్రి హరీశ్​ రావు ఆధ్వర్యంలో తెరాసలో చేరారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆశయసాధనకు అభ్యర్థి సుజాతను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

'సిద్దిపేట తరహాలో దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం'
'సిద్దిపేట తరహాలో దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం'

By

Published : Oct 23, 2020, 8:47 PM IST

భాజాపా నాయకులు తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని మంత్రి హరీశ్​ రావు మండిపడ్డారు. కాంగ్రెస్, భాజపాలతో ప్రజలకు రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు... మంత్రి హరీశ్​ రావు ఆధ్వర్యంలో తెరాసలో చేరారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థి గెలుపు కోసం కరోనా మందును ఉచితంగా పంపిణీ చేస్తామనడం సిగ్గుచేటన్నారు. బీహార్​లో ఉచితంగా ఇస్తే... తెలంగాణలో ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు.

ముంపు ప్రభావిత గ్రామాల్లో సైతం తెరాసకు ఏకగ్రీవంగా మద్దతు పలుకుతున్నాయన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆశయసాధనకు అభ్యర్థి సుజాతను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో తాను భాగస్వామి అయి సిద్దిపేట తరహాలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎంపీపీ సాయిలు, డీసీసీబీ డైరెక్టర్ వెంకటయ్య, వైస్ ఎంపీపీ రాజులు, ఎంపీటీసీ సభ్యులు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది'

ABOUT THE AUTHOR

...view details