తెలంగాణ

telangana

ETV Bharat / state

'యాసంగి రైతుబంధు 20 నుంచి 30 రోజుల్లో జమ' - రైతుబంధు తాజా వార్తలు

హుస్నాబాద్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. యాసంగి రైతుబంధు నగదు 20 నుంచి 30 రోజుల్లోనే జమ అవుతుందని తెలిపారు. భారత్ బంద్​కు తెరాస సంపూర్ణ మద్దతిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

minister harish rao on rythu bandhu in husnabad new agricultural market committee oath ceremony
'యాసంగి రైతుబంధు 20 నుంచి 30 రోజుల్లో జమ'

By

Published : Dec 7, 2020, 5:46 PM IST

యాసంగికి సంబంధించి రైతుబంధు నగదు 20 నుంచి 30 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు.

'యాసంగి రైతుబంధు 20 నుంచి 30 రోజుల్లో జమ'

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. మంగళవారం నాడు రైతు సంఘాలు చేపట్టనున్న భారత్ బంద్​కు తెరాస సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'భారత్​ బంద్​'పై రాష్ట్రాలకు కేంద్రం జాగ్రత్తలు

ABOUT THE AUTHOR

...view details