పేదలు గౌరవంగా బతికేందుకే... ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్ల పథకం ప్రవేశపెట్టారని ఆర్థికమంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పురపాలక సంఘం పరిధిలోని లింగారెడ్డిపల్లిలో... 25 డబుల్ ఇళ్లు ప్రారంభించారు. ఆలస్యమైనా ఇళ్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అర్హులందరికీ త్వరలోనే మరిన్ని ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్, తెదేపా హయాంలో ఇళ్ల నిర్మాణానికి కేవలం రూ.40 వేలు మాత్రమే ఇచ్చేవారు... అవి బేస్మెంట్కు కూడా సరిపోయేవి కావని హరీశ్ ఎద్దేవా చేశారు. అప్పుడు ఇల్లు కడితే అప్పులు పాలయ్యేవారన్నారు. రెండు పడక గదుల ఇళ్ల కోసం ఎవరికైనా లంచం ఇచ్చినా, తీసుకున్నా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.