తెలంగాణ

telangana

అభివృద్ధిలోనే కాదు ఆహ్లాదంలోనూ సిద్దిపేట ఆదర్శం: మంత్రి హరీశ్

సిద్దిపేటను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అభివృద్ధిలోనే కాదు ఆహ్లాదంలోనూ జిల్లా ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. జిల్లాకేంద్రంలోని కోమటిచెరువుపై ఉగాది కానుకగా గ్లో గార్డెన్​ను మంత్రి సోమవారం ప్రారంభించారు.

By

Published : Apr 13, 2021, 8:42 AM IST

Published : Apr 13, 2021, 8:42 AM IST

minister harish about siddipet, harish rao latest news
సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు, అభివృద్ధిపై హరీశ్ రావు వ్యాఖ్యలు

అభివృద్ధిలోనే కాదు ఆహ్లాదాన్ని కల్పించడంలోనూ ఆదర్శంగా ఉన్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. విద్య, వైద్య సదుపాయాలు, క్రీడలు, మానసిక ఉల్లాసం ఇలా అని రంగాల్లో సిద్దిపేట జిల్లాను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువుపై గ్లో గార్డెన్​ను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి సోమవారం ప్రారంభించారు.

నాడు సీఎం కేసీఆర్ కోమటి చెరువుపై రాసిన పాటను... నేడు నిజం చేసుకుంటున్నామని మంత్రి హరీశ్​ రావు అన్నారు. ఉగాది కానుకగా చెరువుపై మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రారంభిస్తామని తెలిపారు. రూ.25 కోట్లతో మిగతా నెక్లెస్ రోడ్​ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు. కోమటి చెరువుపై మూడు రోజుల పాటు లేక్ ఫెస్టివల్... ఉగాది నాడు నెక్లెస్ రోడ్​పై పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.

జిల్లాకు వాలీబాల్ అకాడమీ మంజూరైంది. రూ.2 కోట్లతో స్పోర్ట్స్ హాస్టల్​ని ఏర్పాటు చేశాం. ప్రజల ఆలోచనలే ఎజెండాగా సిద్ధిపేట పట్టణాన్ని తీర్చిదిద్దుతాం. సిద్దిపేట అభివృద్ధిని చూడడానికి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు.

- హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి

ఇదీ చదవండి:ఉగాది విందులో... కారంగా, తియ్యగా!

ABOUT THE AUTHOR

...view details