తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish rao in Chinthamadaka: 'అదంతా రాములవారి దయ.. సీఎం కేసీఆర్ కృషి' - Chinthamadaka News

Harish rao in Chinthamadaka: సిద్దిపేట జిల్లా చింతమడకలో సీతారాముల కల్యాణ మహోత్సవం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. శ్రీరాముని ఆశీస్సులతో సీఎం కేసీఆర్ సహకారంతో తెలంగాణ భూములన్నీ కళకళలాడుతున్నాయన్నారు.

Harish rao
Harish rao

By

Published : Apr 10, 2022, 4:08 PM IST

Updated : Apr 10, 2022, 4:37 PM IST

'అదంతా రాములవారి దయ.. సీఎం కేసీఆర్ కృషి'

Harish rao in Chinthamadaka: మండుటెండుల్లో సైతం చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు పోస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శ్రీరాముని దయతో, సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రమంతా పచ్చని పంటలతో కళకళలాడుతోందని హర్షం వ్యక్తం చేశారు. శ్రీరామనవమి పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా చింతమడకలో సీతారాముల కల్యాణ మహోత్సవం మంత్రి పాల్గొన్నారు. శ్రీరాముని ఆశీస్సులతో సీఎం కేసీఆర్ సహకారంతో జిల్లాలో రిజర్వాయర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

నేను చింతమడక వస్తుంటే.. ఎక్కడ చూసినా చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. ఈ మండుటెండల్లో అందులోనూ ఏప్రిల్‌ నెలలో మత్తుళ్లు పోయడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడ చూసినా పొట్టకొచ్చిన పంటపొలాలు కనపడుతున్నాయి. గతంలో చూస్తే ఎటు చూసినా బీడు భూములు, ఎండిపోయిన పొలాలు చూసేవాళ్లం. కానీ ఇవాళ ఆకుపచ్చని పొలాల్ని చూస్తున్నామంటే అదంతా రాముల వారి దయ, సీఎం కేసీఆర్ కృషి.

-- హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి

తాను కారులో వస్తుండగా ఎటు చూసినా నీళ్లే కనిపించాయని... ఒకప్పుడు కరవు కాటకలతో అల్లాడిపోయిందని హరీశ్ రావు గుర్తు చేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించమని రామయ్యను వేడుకున్నట్లు మంత్రి వివరించారు.

ఇదీ చూడండి: భద్రాచలంలో వైభవంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం

సీత కథ.. మనకూ పాఠమే!

Last Updated : Apr 10, 2022, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details