తెలంగాణ

telangana

ETV Bharat / state

'వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం'

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభిస్తామని మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ డాక్టర్ గంగారాం సహకారంతో రూ.25 లక్షలతో నిర్మించిన డైనింగ్​ హాల్​ను ఆయన ప్రారంభించారు.

minister harish rao
మంత్రి హరీశ్​ రావు

By

Published : Apr 9, 2022, 6:54 PM IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఎన్​ఆర్​ఐ డాక్టర్ రాగి గంగారాం సహకారంతో రూ.25 లక్షలతో నిర్మించిన డైనింగ్​ హాల్​ను మంత్రి హరీశ్​ రావు ప్రారంభించారు. తాను చదివిన పాఠశాలకు తన వంతు సహయం అందించిన గంగారం అందరికి ఆదర్శమని మంత్రి ప్రశంసించారు. ఎవరైనా సరే కన్నతల్లి, చదివిన బడి, సొంత ఊరుని మరచి పోవద్దని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్య బోధన ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రూ.7300 కోట్లు వెచ్చించి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని హరీశ్​ రావు తెలిపారు. రాబోయే విద్యాసంవత్సరంలో తెలుగు, ఇంగ్లీషు రెండు భాషలు ఉండే విధంగా పుస్తకాలు ముద్రణ చేస్తున్నామని అన్నారు. త్వరలోనే ఉపాధ్యాయులకు దీనిపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలో సిద్దిపేట జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి సూచించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాలను రూ.1000 నుంచి రూ.3వేలకు పెంచామన్నారు.

ఇదీ చదవండి: పబ్‌ ఓనర్లకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

ABOUT THE AUTHOR

...view details