తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేదలకు కొండంత అండ సీఏంఆర్ఎఫ్: హరీశ్ రావు

సిద్దిపేటలో సీఏం సహాయ నిధి చెక్కులను మంత్రి హరీశ్​రావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 15 మంది లబ్ధిదారులకు 4,45,500 రూపాయల సీఏంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.

minister-harish-rao-distributes-cmrf-checks-in-siddipet
సీఏంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి

By

Published : Sep 21, 2020, 8:06 PM IST

సిద్ధిపేటలోని తన నివాసంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు లబ్ధిదారులకు సీఏంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 15 మందికి 4,45,500 రూపాయలు అందజేశారు.

నిరుపేద‌ల ఆరోగ్యం కోసం సాయం పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తోందని మంత్రి అన్నారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి :'ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ల ఉల్లంఘన'

ABOUT THE AUTHOR

...view details