తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబేడ్కర్​ వల్లే అట్టడుగు వర్గాలు చట్ట సభల్లో..: మంత్రి హరీశ్ - తెలంగాణ వార్తలు

సిద్దిపేట బురుజుపై మంత్రి హరీశ్ రావు జెండా ఆవిష్కరించారు. అనంతరం 4వ మున్సిపల్ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చారిత్రక కట్టడాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో బురుజుపై జెండా ఎగురవేసినట్లు తెలిపారు. అంబేడ్కర్ రచించిన రాజ్యంగం వల్లే అట్టడుగు వర్గాల వారూ చట్టసభల్లో ఉన్నారని అభిప్రాయపడ్డారు.

minister-harish-rao-did-foundation-stone-to-cc-roads-at-4th-municipal-ward-in-siddipet-district
అంబేడ్కర్​ వల్లే అట్టడుగు వర్గాలు చట్ట సభల్లో ఉన్నారు: మంత్రి హరీశ్

By

Published : Jan 26, 2021, 2:35 PM IST

అంబేడ్కర్​ వల్లే అట్టడుగు వర్గాలు చట్ట సభల్లో ఉన్నారు: మంత్రి హరీశ్

సిద్దిపేట బురుజుపై జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం 4వ మున్సిపల్ వార్డులో రూ.40 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. బురుజుపై జాతీయజెండా ఎగురవేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. చారిత్రక కట్టడాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాటిపై జాతీయ జెండా ఎగురవేశామని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేడ్కర్ రచించడం వల్లే అట్టడుగు వర్గాల వారూ చట్టసభల్లో ఉన్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కావున గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని వివరించారు.

"పట్టణంలో కోతుల, కుక్కల బెడద పెరిగింది. వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాం. ఏ వార్డులోని చెత్త ఆ వార్డులోనే ఎరువుగా తయారు చేయడం గొప్ప విషయం. ప్లాస్టిక్ వాడకం తగ్గించి స్టీల్ బ్యాంకులను వాడండి. 4వ వార్డులో స్వచ్ఛ స్కూల్ ఏర్పాటు చేశాం. మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో డిజిటల్ క్లాస్ ద్వారా స్వచ్ఛ స్కూల్​లో చూపిస్తారు. ఇలాంటి స్కూల్ దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేదు. స్వచ్ఛ సర్వేక్షన్​లో ప్రజల భాగస్వామ్యం అవసరం. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సర్వేక్షణ్-2021లో పాల్గొనాలి."

-హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, మున్సిపల్ కౌన్సిలర్ దీప్తి నాగరాజు, ఇతర మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్​'

ABOUT THE AUTHOR

...view details