సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో తెరాస కార్యకర్తలు మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోహెడ ప్యాక్స్ ఛైర్మన్ దేవేందర్ రావు.. మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు చెందిన 130 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
ఘనంగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలు - సిద్దిపేట జిల్లా వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలను తెరాస కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో.. పార్టీ కార్యకర్తలు, మంత్రి అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
minister harish rao birthday celebrationss
ప్రజల గుండెల్లో అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు మంత్రి హరీశ్ రావు.. ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో జీవించాలని దేవేందర్ కోరారు. రానున్న రోజుల్లో పార్టీలో ఉన్నత పదవులు పొందాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Paddy In Water:ఎడతెరిపి లేని వర్షం... తడిసి ముద్దవుతున్న ధాన్యం