సిద్దిపేట మున్సిపాలిటీకి తాగునీటి కోసం నాబార్డు ద్వారా రూ. 380 కోట్లు మంజూరు చేయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మల్లన్నసాగర్ పూర్తయితే సిద్దిపేటకు తాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీలో నల్లా కనెక్షన్లు లేని ఇళ్లు ఉండొద్దని అధికారులను ఆదేశించారు.
'మల్లన్నసాగర్ పూర్తయితే సిద్దిపేటకు తాగునీరు' - mallanna sagar
సిద్దిపేట మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. సిద్దిపేటకు మంచినీళ్లు తెచ్చుకుంటే మున్సిపాలిటీ ఖర్చు తగ్గుతుందని మంత్రి తెలిపారు.
'మల్లన్నసాగర్ పూర్తయితే సిద్దిపేటకు తాగునీరు'
మిగులు బడ్జెటుతో బ్యాంకులో డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే విధంగా మున్సిపాలిటీ ఎదగాలని సూచించారు. పట్టణంలో మొదటి దశలో మిగిలి పోయిన యూజీడీ కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. యూజీడీ కనెక్షన్లు పొందేందుకు ప్రజలకు భారం లేకుండా చేశామని, ఈ విషయంలో స్థానిక కౌన్సిలర్లు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి ఆదేశించారు.