ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేకుండా పోయిందని మందకృష్ణ మాదిగ నిరసన వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారుల జోక్యం ఉందని వ్యాఖ్యానించారు. రైతు బ్యాగరి నరసింహులు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
'సీఎం నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేదు' - మందకృష్ణ మాదిగ ఆవేదన
సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేకుండా పోయిందని మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వేలూరు రైతు బ్యాగరి నరసింహులు కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. బాధ్యులైన రెవెన్యూ అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
'సీఎం నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేదు'
వారం రోజుల్లో న్యాయం చేయకపోతే గజ్వేల్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద దీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల మానిఫెస్టోలో దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి :వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత