మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో అధికారులకు ఘన స్వాగతం లభిస్తోంది. ప్రభుత్వం అందిస్తోన్న పరిహారానికి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామస్థులకు పరిహారం అందించడానికి తొగుట మండలం వేములఘట్కు వెళ్లిన అధికారులకు ప్రజలు డప్పు చప్పుల్లతో ఆహ్వానం పలికారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నిర్వాసితులకు పరిహారం, ఇళ్లు, స్థలాలు కేటాయింపు పత్రాలు అధికారులు అందించారు. కొండపోచమ్మ జలాశయం ముంపు గ్రామాలు బైలంపూర్, మామిడ్యాలలోనూ అధికారులు చెక్కుల పంపిణీ ప్రారంభించారు.
ప్రభుత్వానికి మల్లన్నసాగర్ ముంపు గ్రామాల కృతజ్ఞత - పాలాభిషేకం
ప్రభుత్వం అందిస్తోన్న పరిహారానికి మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చిన అధికారులకు డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు.
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల కృతజ్ఞత