తెలంగాణ

telangana

ETV Bharat / state

మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం పంపిణీ - మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం పంపిణీ

సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ ముంపు గ్రామాల వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం పంపిణీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం పంపిణీ

By

Published : May 5, 2019, 3:23 PM IST

మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం పంపిణీ

మల్లన్న సాగర్ ముంపు గ్రామం కొండపాక మండలం ఎర్రవల్లిలో ఆర్ అండ్ ఆర్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. మల్లన్నసాగర్ నిర్వాహిసతులకు పరిహారం పంపిణీ కోసం ప్రత్యేకంగా రెవెన్యూ సిబ్బందికి బాధ్యతలు అప్పగించి మొత్తం 5 కౌంటర్లను ఏర్పాటు చేశారు. గ్రామంలోని 558 మంది లబ్ధిదారులకు 7 లక్షల 50 వేల రూపాయల చెక్కుతో పాటు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్రాజ్​పల్లిలో నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ ధ్రువపత్రాన్ని అందజేశారు. అలాగే గ్రామంలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీయువకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలతో పాటు ముత్రాజ్​పల్లిలో 250 గజాల ప్లాటు ధ్రువపత్రాన్ని అందజేశారు.

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సంతృప్తికరంగా ఉందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిన గ్రామస్థులకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పరిహారం అందించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.

పరిహారం పంపిణీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుంజా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి: మహా దీక్షకు అందరూ హాజరవ్వాలి: కోదండరాం

ABOUT THE AUTHOR

...view details