సిద్దిపేట జిల్లా తొగుట సమీపంలో జరుగుతున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణాలను నిలిపివేయాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. హైకోర్టు ఉత్తర్వులను లెక్కచేయకుండా.. గుత్తేదారులు నిర్మాణాలు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు నిలిపివేయాలని డిమాండ్ చేసిన నిర్వాసితులతో గుత్తేదారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని వారు స్పష్టం చేశారు.
'మల్లన్నసాగర్ గుత్తేదారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు'
మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని సిద్దిపేట జిల్లా తొగుట వాసులు డిమాండ్ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మాణాలు ఆపాలని డిమాండ్ చేసిన నిర్వాసితులపై ప్రాజెక్టు గుత్తేదారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'మల్లన్నసాగర్ గుత్తేదారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు'