సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. ప్రాజెక్టు పనుల తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాలను ప్రాజెక్టుపై నుంచి పరిశీలించారు. అక్కడికి చేరుకున్న భూ నిర్వాసితులు తమకు రావాల్సిన నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ ఎంపీ ముందు తమ బాధను వెలిబుచ్చారు. భూ నిర్వాసితులకు రావాల్సిన నష్టపరిహారం విషయంలో అధికారులతో మాట్లాడి సకాలంలో అందేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.
నష్టపరిహారం అందేలా చేస్తా: బండి సంజయ్ - నష్టపరిహారం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అక్కన్నపేట వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న భూ నిర్వాసితులకు నష్టపరిహారం సకాలంలో అందేలా కృషి చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు.
నష్టపరిహారం అందేలా చేస్తా: బండి సంజయ్