తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్ మరింత కఠినం.. డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ

సిద్దిపేట పట్టణంలో లాక్​డౌన్​ పరిస్థితిని పోలీస్ కమిషనర్ డీ జోయల్ డేవిస్ డ్రోన్ కెమెరాతో పరిశీలించారు. కాలనీలు, చిన్న వీధుల్లో దుకాణాల వద్ద భౌతిక దూరం పాటిస్తున్నారా అనే విషయాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా తెలుసుకుని, చర్యలు చేపడతామన్నారు.

Lockdown is more strict monitoring by drone camera at siddipet
లాక్​డౌన్ మరింత కఠినం.. డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ

By

Published : Apr 21, 2020, 7:13 PM IST

సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలో లాక్​డౌన్​ పరిస్థితిని పోలీస్ కమిషనర్ డీ జోయల్ డేవిస్ డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షించారు. విక్టరీ, అంబేడ్కర్, ముస్తాబాద్ చౌరస్తాల్లో డ్రోన్ కెమెరాతో ప్రత్యక్షంగా పరిశీలించారు. కరోనా వ్యాధి నివారణకు లాక్​డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.

డ్రోన్ కెమెరాల ద్వారా లైవ్ మానిటరింగ్ చేసి ఎక్కడైతే ప్రజలు అనవసరంగా ఉన్నారో వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. పని లేకుండా రోడ్లపై మోటార్ సైకిళ్లతో తిరిగే వ్యక్తులను డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెట్టి వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, పోలీసుల సూచనలు సలహాలు పాటించాలని కోరారు.

ఇదీ చూడండి :'ఆ లక్ష మంది వలస కార్మికుల పరిస్థితేంటి?'

ABOUT THE AUTHOR

...view details