సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల్లో 687 మందికి మాత్రమే పరిహారం ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారని మిగతా వారు ఆందోళనకు దిగారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు జరగకుండా అడ్డుకున్నారు.
భూ నిర్వాసితుల ఆందోళనతో గౌరవెల్లి ప్రాజెక్టుకు బ్రేక్ - సిద్దిపేటలో గౌరవెల్లి భూ నిర్వాసితుల ఆందోళన
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి భూ నిర్వాసితులు గౌరవెల్లి ప్రాజెక్టు పనులు అడ్డుకున్నారు. తమకు పరిహారం ఇచ్చే వరకు ప్రాజెక్టు పనులు జరగనివ్వబోమని ఆందోళనకు దిగారు.
భూ నిర్వాసితుల ఆందోళనతో గౌరవెల్లి ప్రాజెక్టుకు బ్రేక్
18 సంవత్సరాలు నిండిన యువతకు ఆర్ అండ్ ఆర్ పూర్తి ప్యాకేజీ చెల్లించి, రీడిజైన్‌లో ఇళ్లు కోల్పోయిన 107 మందికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టు తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇచ్చేంత వరకు గౌరవెల్లి ప్రాజెక్టు పనులు జరగనివ్వబోమని స్పష్టం చేశారు.
అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా భూ నిర్వాసితులు ఆందోళన విమరించకపోవడం వల్ల ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.
- ఇదీ చూడండి :ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడి అరెస్టు