భావితరాల భవిష్యత్తు కోసం ప్రతీ నీటి బొట్టును సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ నీరజ అన్నారు. జల సంరక్షణ కోసం పునరంకితం అవుదామన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ములుగులోని విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులతో ర్యాలీ చేశారు.
నీటి ప్రాముఖ్యత.. నీటి సంక్షోభానికి గల కారణాలను వీసీ నీరజ విద్యార్థులకు వివరించారు. బిందు, తుంపర సేద్యం పద్ధతులను అవలంబించడం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చని పేర్కొన్నారు.