సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. ఆలయ ఈవో బాలాజీ ఆలయ పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ దువ్వల మల్లయ్య, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లిఖార్జన్ సమక్షంలో ఆలయ ముఖ మండపంలో హుండీ లెక్కింపు చేపట్టారు.
కొమురవెల్లి మల్లన్నకు రూ.82,30,722 ఆదాయం - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు
భక్తుల కొంగు బంగారమైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి ఆలయం హుండీ లెక్కింపు చేపట్టారు. స్వామి వారికి రూ.82,30,722 వచ్చినట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు.
కొమురవెల్లి మల్లన్నకు రూ.82,30,722 ఆదాయం
ఉదయం 10 గంటలకు ప్రారంభమైన లెక్కింపు సాయంత్రం వరకు కొనసాగింది. మల్లన్నకు హుండీ ద్వారా రూ 82, 30, 722 నగదు రాగా.. 9 కిలోల 400 గ్రాముల మిశ్రమ వెండి.. 116 గ్రాముల మిశ్రమ బంగారం.. నలభై ఒక్క విదేశీ నోట్లు వచ్చాయి. వీటితో పాటు పసుపు బియ్యం కూడా వచ్చాయి.
ఇదీ చదవండి:పీఆర్సీపై వెనక్కి తగ్గం... తెగేసి చెప్పిన ఉద్యోగ సంఘాలు