సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 8, 11 వార్డులలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
ఎన్నికల వరకే రాజకీయాలు: బండి సంజయ్ - పట్టణ ప్రగతి కార్యక్రమం
రాజకీయాలు, వాగ్దానాలు ఎన్నికల వరకేనని.. అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు.
ఎన్నికల వరకే రాజకీయాలు: బండి సంజయ్
రాజకీయాలు, వాగ్దానాలు ఎన్నికల మట్టుకేనని.. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని బండి సంజయ్ సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే బాధ్యత అధికారులదేనని గుర్తు చేశారు. విమర్శలు ప్రతి విమర్శలకు తావు లేకుండా తన వంతు బాధ్యతగా అభివృద్ధి కోసం కృషి చేస్తానని సంజయ్ హామీ ఇచ్చారు.