తెలంగాణ

telangana

ETV Bharat / state

రంగనాయకసాగర్​కి నీటి తరలింపునకు ఏర్పాట్లు

కాళేశ్వరం ప్రాజెక్టులో తదుపరి నీటిఎత్తిపోతకు రంగం సిద్ధమైంది. రెండో లింక్​లోని అనంతగిరి జలాశయం నుంచి రంగనాయకసాగర్ జలాశయానికి నీరును ఎత్తిపోసేందుకు సన్నాహకాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మధ్యమానేరు నుంచి అనంతగిరి జలాశయానికి నీటిని తరలించారు.

By

Published : Apr 15, 2020, 11:57 PM IST

kaleshwarama project 11th package
రంగనాయకసాగర్​కి నీటి తరలింపునకు ఏర్పాట్లు

సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్​కు నీటిఎత్తిపోతకు రంగం సిద్ధమైంది. అనంతగిరి నుంచి 11వ ప్యాకేజీ పంప్ హౌజ్ ద్వారా రంగనాయక్​సాగర్​లోకి నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతగిరి నుంచి 11వ ప్యాకేజీ సర్జ్ పూల్​లోని నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సర్జ్​పూల్​లో ఐదు మీటర్లకు పైగా నీరు చేరింది. 23మీటర్లకు పైగా నీరు చేరితే పంపుల ద్వారా ఎత్తిపోస్తారు.

11వ ప్యాకేజీలో 134.34 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ పంపులను అమర్చారు. ఎనిమిదో ప్యాకేజీలోని బాహుబళి పంపుల తర్వాత రెండో పెద్ద పంపులుగా వీటిని చెప్పుకోవచ్చు. ఒక్కో పంపు మూడు వేల క్యూసెక్కుల చొప్పున ఒక టీఎంసీ నీటిని ఎగువకు ఎత్తిపోస్తాయి. సర్జ్​పూల్​లోకి తగిన నీటి మట్టం చేరాక అన్నింటిని పూర్తిస్థాయిలో పరీక్షించి దశలవారీగా ఒక్కో పంపు నుంచి రంగనాయకసాగర్​లోకి నీటిని ఎత్తిపోస్తారు.

మూడు టీఎంసీల సామర్థ్యంతో రంగనాయకసాగర్ ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమైంది. అక్కడి నుంచి సిద్దిపేట జిల్లాలోని పంటపొలాలకు నీరివ్వటంతోపాటు మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్​కు కూడా నీరు తరలిస్తారు. వచ్చే వారం రంగనాయకసాగర్​లోకి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది.

ఇవీచూడండి:కంటైన్మెంట్​ జోన్​ ప్రజలకు అండగా ఉంటాం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details