సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జనవరి 31న జరిగే హాఫ్ మారథాన్ పరుగు పోటీల్లో యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఏసీపీ మహేందర్ పిలుపునిచ్చారు. హాఫ్ మారథాన్ సన్నాహక కార్యక్రమంలో భాగంగా .. హాఫ్ మారథాన్ ఫెస్ట్, ఫ్లాగ్ రిలే, ఫ్లాష్ మాబ్ ర్యాలీని హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వరకు స్థానిక ప్రజా ప్రతినిధులు, యువతీ యువకులతో కలిసి ఆయన నిర్వహించారు. ఫ్లాష్ మాబ్ ర్యాలీలో యువతీ యువకులు దేశభక్తి గీతాలకు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
'రాబోయే రోజుల్లో పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్' సద్వినియోగం చేసుకోండి..
ఈ నెల 31వ తేదీన ఆదివారం ఉదయం 5 గంటలకు హుస్నాబాద్ పట్టణంలోని సంఘమిత్ర పీజీ కళాశాల సమీపంలో హాఫ్ మారథాన్ నిర్వహించడం జరుగుతుందని ఏసీపీ తెలిపారు. ఇందులో 21కె,10కె, 5కె పరుగు పోటీలు నిర్వహించడంతో పాటు మహిళలకు ప్రత్యేకంగా 5కె పరుగు పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో పోలీస్ శాఖలో 20 నుంచి 50 వేల వరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుందని తెలిపిన ఆయన.. ఈ పోటీల్లో యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:రికార్డు స్థాయిలో నీరు ఎత్తిపోసిన గాయత్రి పంపుహౌస్