ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించిన వ్యవహారాలపై ప్రత్యేకంగా ఏర్పాటైన హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టి ఆదేశాలు జారీ చేసింది. మల్లన్నసాగర్ భూసేకరణలో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుటలో ఇంటింటి సర్వే చేసి నివేదిక సమర్పించాలని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. భూమి లేని పేదలు, ఇతర వృత్తి పనివారు ఎవరెవరున్నారు, అర్హులెవరు, వారికి అందించిన పరిహారం తదితర వివరాలతో జాబితాను రూపొందించి సమర్పించాలని సూచించింది. మల్లన్నసాగర్ నిమిత్తం తొగుట గ్రామంలో 3వేల నాలుగొందల ఎకారాలుండగా, 2వేల ఆరొందల ఎకారాలను ప్రభుత్వం సేకరించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. గ్రామం ముంపునకు గురికాకపోయినప్పటికీ కూలీలు, వృత్తిపనివారు ఉపాధి కోల్పోయినట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పునరావాస ప్యాకేజిపై తొగుట గ్రామంలో ఇంటింటి సర్వే చేసి ఈ నెల 23న నివేదిక సమర్పించాలంటూ ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
' మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రభావితులను ఇంటింటి సర్వేచేసి గుర్తించండి' - 'ప్రాజెక్టు ప్రభావితును ఇంటింటి సర్వేచేసి గుర్తించండి'
మల్లన్నసాగర్ భూసేకరణ వ్యవహారంలో ప్రాజెక్టు ప్రభావితులను గుర్తించి నివేదిక సమర్పించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. సిద్దిపేట జిల్లా తొగుటలో ఇంటింటి సర్వే చేసి నివేదిక తయారు చేయాలని సూచించింది.
'ప్రాజెక్టు ప్రభావితును ఇంటింటి సర్వేచేసి గుర్తించండి'
TAGGED:
mallanna sagar