సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్హాల్లో పట్టణంలోని వ్యాపారులకు, వర్తకులకు తమ వ్యాపార కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అంశంపై పట్టణ పోలీసులు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని.. ఇప్పటికే బిగించుకున్న వారు.. అవి ఎలా పని చేస్తున్నాయో.. తనిఖీ చేసుకోవాలని ఏసీపీ మహేందర్ సూచించారు. బతుకమ్మ, దసరా, దీపావళి సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ చేసే అవకాశం ఉన్నందున దొంగతనాలు జరిగే అవకాశముందని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వ్యాపారులు నష్టపోయే పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చని ఆయన తెలిపారు.
పట్టణంలో వ్యాపార కేంద్రాలు, పలు కూడళ్లలో పాడైపోయిన సీసీ కెమెరాలను వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. వార్డుల వారిగా సీసీ కెమెరాల పనితీరును త్వరలో పర్యవేక్షించనున్నట్టు ఆయన తెలిపారు. సీసీ కెమెరాల వల్ల ఏ చిన్న ఘటన జరిగినా, నేరాలు చోటు చేసుకున్నా కేసు ఛేదించడం సులువవుతుందని.. ప్రజలకు రక్షణ కల్పించడం సులభమవుతుందని ఏసీపీ అన్నారు.