సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను స్థానిక ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ పరిశీలించారు. కోహెడ, అక్కన్నపేట, చిగురుమామిడి, హుస్నాబాద్ మండలాలలోని గ్రామాల్లో ఆయన పర్యటించారు. మామిడి, వరి, మొక్కజొన్న పంటలు వడగళ్ల వర్షాలకు పూర్తిగా నాశనమయ్యాయి. పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల రైతులకు పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. పిడుగుపాటుకు చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
నష్టపోయిన పంటలను పరిశీలించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే - mla visit
హుస్నాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వడగండ్ల వర్షం వల్ల నాశనమైన పంటలను స్థానిక ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ పరిశీలించారు.
హుస్నాబాద్ ఎమ్మెల్యే పరిశీలన