రాష్ట్రంలో లాక్డౌన్ మినహాయింపు ఉన్న నాలుగు గంటల సమయంలో మార్కెట్ల వద్ద రద్దీ నెలకొంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్య వ్యాపార సముదాయాలు కిటకిటలాడుతున్నాయి. సమయం ముగిసినా కొందరు దుకాణాలు మూసి వేయకపోవడం వల్ల ఏఎస్సై నిర్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం పది గంటల లోపే దుకాణాలను మూసివేయాలని సూచించారు.
నిత్యావసరాల కోసం తరలివస్తున్న జనం.. మార్కెట్లు కిటకిట!
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని వ్యాపారసముదాయాలు ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య రద్దీగా మారుతున్నాయి. ప్రజలు నిత్యావసరాల కోసం తరలివస్తున్నారు. పది గంటలు దాటినా దుకాణాలు మూసివేయకపోవడం వల్ల ఏఎస్సై నిర్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్కెట్ల వద్ద రద్దీ, హుస్నాబాద్‌లో లాక్డౌన్
ఇదే సమయంలో ప్రధాన రహదారిపై ఒరిస్సా నుంచి సిద్దిపేట మీదుగా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ గ్రామానికి ఇటుక పని కోసం వచ్చిన వలస కార్మికులు కనిపించారు.
ఇదీ చదవండి:దృఢ సంకల్పంతో కరోనాను జయించిన కుటుంబం