సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలోని రహదారి పక్కనే ఉన్న దుకాణాలలోకి వరద నీరు చేరడంతో దుకాణదారులు ఇబ్బందులు పడ్డారు.
హుస్నాబాద్‌లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం - సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భారీ వర్షం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని దుకాణాల్లోకి భారీగా వరద నీరు చేరింది.
హుస్నాబాద్‌లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం
పురపాలక అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా డ్రైనేజీ సమస్యను పరిష్కరించడం లేదని స్థానికులు వాపోతున్నారు. దీంతో వర్షం వచ్చినప్పుడు నీరు చేరి దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి రహదారులపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.