తెలంగాణ

telangana

హుస్నాబాద్​లో చెత్తకుప్పలో ‘హరితహారం’ మొక్కలు

హరితహారం అపహాస్యమవుతోంది. ప్రభుత్వం మొక్కల పెంపకంతో పర్యావరణాన్ని కాపాడాలనే ప్రయత్నం చేస్తుండగా... అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో లక్ష్యం నీరుగారుతోంది. హుస్నాబాద్​ పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు సుమారు మూడు వేలకు పైగా మొక్కలను పెంటకుప్పలో పడేశారు.

By

Published : Jun 27, 2020, 5:48 PM IST

Published : Jun 27, 2020, 5:48 PM IST

Harithaharam plants for neglected in Husnabad in siddipeta district
హుస్నాబాద్​లో ‘హరితహారం’ మొక్కలు బుగ్గిపాలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం నిర్లక్ష్యానికి గురవుతోంది. పట్టణ శివారులోని కరీంనగర్ పాలకేంద్రం వెనకాల సుమారు మూడు వేలకు పైగా మొక్కలు కుప్పగా పడేసి ఉండటాన్ని సీపీఐ నాయకులు గుర్తించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టారు. ముందస్తు ప్రణాళిక లేకుండా పట్టణంలోని విద్యుత్ లైన్ల కింద మొక్కలు నాటుతున్నారని ఆరోపించారు.

హరితహారం మొక్కలను పెంటకుప్పలో పడేసిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. నాటిన తర్వాత పెరిగిన మొక్కలను కొట్టి వేస్తే జరిమానాలు విధిస్తున్న అధికారులు.. నాటే మొక్కలను వృథా చేయకుండా ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:నగరంలో దుకాణదారుల స్వచ్ఛంద లాక్​డౌన్​

ABOUT THE AUTHOR

...view details