సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో ఉడ్‌ల్యాండ్ ఫుట్‌వేర్ ముందు మున్సిపల్ సిబ్బంది హరితహారంలో భాగంగా వేప మొక్కను నాటారు. ఈ మొక్కను షాపు యజమాని ఉమేష్ ఉద్దేశపూర్వకంగా తొలిగించినట్లు సీసీ కెమెరా ద్వారా హార్టికల్చర్ అధికారులు గుర్తించారు. నిందితుడు ఉమేష్‌పై చర్య తీసుకోవాలని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఉద్యానవన అధికారి ఐలయ్య ఫిర్యాదు చేశారు. నిందితునిపై పలు సెక్షన్ల కింద సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. హరితహారం చెట్లకు ఎవరు హాని తలపెట్టినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మొక్కను పీకేసినందుకు కేసు నమోదు - మొక్కను పీకేసినందుకు
హరితహారంలో నాటిన మొక్కను పీకేసినందుకు అధికారులు సీరియస్‌గా స్పందించారు. సీసీ ఫూటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించి కేసులు నమోదు చేశారు.
మొక్కను పీకేసినందుకు కేసు నమోదు