తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలవరం పనులు మరో 5 ఏళ్లయినా పూర్తికావు: మంత్రి హరీశ్‌రావు - పోలవరంపై హరీశ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు

Harish Rao Comments on kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. దిల్లీలో, హైదరాబాద్‌ పార్టీ కార్యాలయాల్లో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుందని.. గ్రామాల్లోకి వెళ్లి చూస్తే కాళేశ్వరం ఫలితాలు తెలుస్తాయన్నారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు మరో ఐదేళ్లయినా పూర్తి చేయలేరని అన్నారు. కాళేశ్వరం కంటే ముందే పోలవరం ప్రారంభించినా ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారన్నారు.

Harish rao
Harish rao

By

Published : Nov 13, 2022, 6:38 PM IST

పోలవరం పనులు మరో 5 ఏళ్లయినా పూర్తికావు: హరీశ్‌రావు

Harish Rao Comments on kaleshwaram Project: పోలవరం ప్రాజెక్టుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి హరీశ్‌రావు.. కాళేశ్వరం గురించి ప్రతిపక్ష నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక అబద్దాన్ని పదేపదే చెప్పి నిజమే అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ఫలాలు అందుకుంటున్న ప్రజలు ఆ అబద్దాలను తిప్పికొట్టాలని సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.

కాళ్వేశరం గొప్పతనాన్ని అందరికీ చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. దిల్లీలో, హైదరాబాద్‌ పార్టీ కార్యాలయాల్లో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుందని... గ్రామాల్లోకి వెళ్లి చూస్తే కాళేశ్వరం ఫలితాలు తెలుస్తాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు ఏపీలో ప్రారంభమైన పోలవరం ఇంతవరకు పూర్తి కాలేదని తెలిపారు. అక్కడ ఇంజనీర్లను అడిగితే ఎప్పుడు పూర్తవుతుందో తెలియదంటున్నారని వ్యాఖ్యానించారు. భాజపా నాయకులు తెలంగాణ రైతులను నూకలు తినమని అవమాన పరిచారన్న హరీశ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గింజ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. భాజపా అధికారంలోకి వచ్చి నల్ల చట్టాలు తెచ్చిందని ఆరోపించారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

'పోలవరం పనులు మరో 5 ఏళ్లయినా పూర్తికావు. కాళేశ్వరం కంటే ముందే పోలవరం పనులు ప్రారంభించారు.పోలవరం పనుల పురోగతిపై అక్కడి ఇంజినీర్లతో మాట్లాడా. మరో ఐదేళ్లలో పూర్తయితే గొప్పేనని ఇంజినీర్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు తెలంగాణకు అందుతున్నాయి. పోలవరం పూర్తి కాలేదు... ఆ ఫలితం అందలేదు. కాళేశ్వరం పూర్తి అయింది... రాష్ట్రవ్యాప్తంగా ఆ ఫలితం అందింది.'-హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details