తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏం బాబు చెట్టు కనపడలేదా..?

మన చుట్టూ ఉన్న చెట్లను రక్షించాల్సిన బాధ్యత మనదే అని ఓ షాపు యజమానికి గుర్తు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేటలో పర్యటిస్తున్న సమయంలో ఓ షాపు ముందు కింద పడి ఉన్న చెట్టును చూశారు. ఆ యజమానితో చెట్టును కర్రతో కట్టించి సరి చేయించారు.

చెట్టును సంరంక్షించిన హరీశ్​ రావు

By

Published : Aug 3, 2019, 4:22 PM IST

చెట్టును సంరంక్షించిన హరీశ్​ రావు
నాటిన మొక్కను నిర్లక్ష్యం చేస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. సిద్దిపేటలో హరీశ్​ రావు పర్యటిస్తుండగా పాత బస్టాండ్​ కరీంనగర్​ రోడ్డులో ఒక షాపు ముందు పడి ఉన్న మొక్కను చూశారు. నేరుగా కారు దిగి షాపు యజమాని దగ్గరికి వెళ్లి ... " ఏం బాబు చెట్టు కింద పడింది..కనపడటం లేదా.... ! షాప్ ఓపెన్ చేసేప్పుడు చెట్టును చూడలేదా. ! రోజు ఉన్న చెట్టు లేదు అని గమనించలేదా... ! చెట్టు అంటే అంత నిర్లక్ష్యమా..!! అని షాప్ యజమానిని అడిగారు. అక్కడే ఉండి అతనితో కింద పడిన మొక్కను కర్రతో కట్టించి సరి చేయించారు. మన ప్రాణం ఎంతో.. మొక్క ప్రాణం అంతే అని మరో సారి మొక్కను నిర్లక్ష్యం చేయ్యొద్దని హితవు పలికారు. ఇవీ చూడండి: ఆ స్వామి దర్శనం 40 ఏళ్లకోసారి 48 రోజులే..!

ABOUT THE AUTHOR

...view details