సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి భవన్లోహరితహారంపై ఎమ్మెల్యే హరీశ్ రావు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ కార్యక్రమం అయిన నేను అనుకుంటే విజయవంతం కాదు... మనము అనుకుంటేనే విజయవంతమవుతుందన్నారు. రైతులను, అధికారులు, ప్రజా ప్రతినిధులు, మొక్కలు నాటేలా ప్రోత్సహించాలన్నారు. మొక్కలు చక్కగా నాటి సంరక్షణ చేసిన గ్రామానికి, బాధ్యతతో పని చేసిన అధికారులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. మళ్లీ ఆగస్టు 30న సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు.
హరితహారంపై ఎమ్మెల్యే హరీశ్ సమీక్ష - harish rao
చెట్లను పెంచడం అన్నింటికి మంచిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి భవన్లో హరితహారంపై సిద్దిపేట నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
హరీశ్ రావు