తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేటకు సురేందర్ గర్వకారణం.. హరీష్​రావు పొగడ్తల వర్షం - SPACE

చంద్రయాన్ -2 ప్రయోగంలో పాలుపంచుకున్న అంతరిక్ష పరిశోధనా శాస్త్రవేత్త వీరబత్తిని సురేందర్​కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.

సిద్దిపేటకు సురేందర్ గర్వకారణం.. హరీష్​రావు పొగడ్తల వర్షం

By

Published : Jul 13, 2019, 6:19 PM IST

Updated : Jul 13, 2019, 7:31 PM IST

భారతదేశశాస్త్ర – సాంకేతిక - అంతరిక్ష విజ్ఞానానికి తలమానికంగా నిలిచే చంద్రయాన్ -2 ప్రయోగంలో సిద్దిపేట వాసి వీరబత్తిని సురేందర్​ పాలు పంచుకున్నారు. ఆ విషయంపై స్పందించిన హరీశ్ రావు... ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేశాడు. సిద్దిపేట ముద్దుబిడ్డ, అంతరిక్ష పరిశోధనా శాస్త్రవేత్త, ఆత్మీయ సోదరుడికి మనసారా శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. భారతదేశానికే గర్వకారణంగా నిలిచే ఈ ప్రయోగంలో సురేందర్ భాగస్వాములు కావడం సిద్దిపేట జిల్లావాసులందరికీ గర్వకారణమని హరీశ్ రావు తెలిపారు. భారతదేశ అంతరిక్ష ప్రయోగ రంగానికి, ప్రపంచానికి వీరబత్తిని సురేందర్ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.

సిద్దిపేటకు సురేందర్ గర్వకారణం.. హరీష్​రావు పొగడ్తల వర్షం
Last Updated : Jul 13, 2019, 7:31 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details