అక్కన్నపేటలో కాల్పుల కలకలం - undefined
07:34 February 07
అక్కన్నపేటలో అర్ధరాత్రి కాల్పుల కలకలం
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో అర్ధరాత్రి కాల్పుల కలకలం కలవర పెట్టింది. మూడురోజుల క్రితం ఇటుకల విషయంలో గంగరాజు, సదానందం మధ్య గొడవ జరిగింది. గంగరాజు ఇంట్లోకి వెళ్లి ఏకే47తో సదానందం కాల్పులు జరిపాడు. గంగరాజు త్రుటిలో తప్పించుకున్నాడు.
కాల్పులతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. సదానందానికి ఏకే47 ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. సదానందం కోసం గాలిస్తున్న పోలీసులు... కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు.