సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో కాల్పులు జరిపి ప్రజలను భయాందోళనకు గురి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కోహెడ మండల పరిధిలో నిందితుడు సదానందం అనే వ్యక్తి ఏకే47 తుపాకీతో కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.
అక్కన్నపేటలో ఏకే47 తో కాల్పులు.. నిందితుడు అరెస్టు - SIDDIPET CRIME NEWS
ఓ వ్యక్తి ఏకే47తో ఇష్టారీతిన కాల్పులు జరిపాడు. ఊళ్లోవాళ్లను భయాందోళనకు గురిచేశాడు. స్థానికులు సమాచారమివ్వగా... వెంటనే వచ్చిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి... తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
GUN FIRE AT AKKANNAPET WITH GUN AK47
నిందితునితో పాటు... కాల్పులకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. సదానందం ఇంట్లో పోలీసులు సోదా చేయగా... కార్బన్ తుపాకీ లభ్యమైంది. నిందితున్ని అదుపులోకి తీసుకుని... సిద్దిపేటకు తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు జరగకపోవటం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి:'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'