తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కజొన్నకు మిడతల గండం

మొక్కజొన్న రైతును నిన్నటి వరకు కత్తెర పురుగు కలవర పెట్టగా.. తాజాగా మిడతలు అన్నదాతకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. లక్షల సంఖ్యలో మిడతలు చేనుపై వాలి.. చూస్తుండగానే నామరూపాలు లేకుండా చేస్తున్నాయి.

మిడత

By

Published : Sep 12, 2019, 8:48 AM IST

సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని గోవర్ధనగిరి, వరదరాజుపల్లి, ఘనాపూర్​లో మొక్కజొన్న మిడతలు పంజా విసురుతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే వందల ఎకరాల మక్క పంటను నాశనం చేశాయి. పరిస్థితిని గుర్తించి.. అప్రమత్తమైన వ్యవసాయ శాఖ.. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించారు. వివిధ గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు. మిడతల నమూనాలు, రైతుల నుంచి వివరాలు సేకరించారు. మిడతల గుంపు దాడి వల్ల పూర్తిగా నష్టపోయామని.. పరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని కర్షకులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

మొక్కజొన్నకు మిడత... పంట పండేదెట్లా?

ABOUT THE AUTHOR

...view details