Gouravelli project expats protest : హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో నిర్వాసితుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన సతీశ్‌కుమార్... ఆందోళన విరమించాలని నిర్వాసితులను కోరారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని.. ప్రాజెక్టు పనులు జరగనివ్వాలని చెప్పారు.
Gouravelli project expats protest : ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు చేదు అనుభవం.. - తెలంగాణ వార్తలు
Gouravelli project expats protest : హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చెప్పినా... ఆందోళన విరమించేది లేదని నిర్వాసితులు తేల్చిచెప్పారు.
ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు చేదు అనుభవం..
సమస్యలు పరిష్కరించాకే పనులు చేపట్టాలన్న నిర్వాసితులు..అప్పటివరకు ఆందోళన విరమించబోమని తేల్చిచెప్పారు. నిర్వాసితులు తమ సమస్యలను ఏకరువు పెట్టి... ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్వాసితుల ఆందోళనతో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ వెనుదిరిగారు.
ఇదీ చదవండి:National Conference on Oil Palm Cultivation: హైటెక్స్‌లో ఆయిల్‌పామ్ సాగుపై జాతీయ సదస్సు